Posts

SHORT INFORMATION ABOUT HINDU TRADITION AND ITS RALATION TO SCIENCE AND TECHONOLOGY

  ఒక పరమాణువు విశ్వాన్నంతటినీ సృష్టిస్తే, ఆ సృష్టిలోని చరాచరములన్నీ పరమాణువులతోనే తయారుగాబడివుంటాయి. ఆ మొట్టమొదటి పరమాణువుయొక్క మూల ధర్మాలే అన్ని  చరాచరముల అణువులలోనూ  నిభిఢీకృతమై వుంటాయి.  భౌతిక, పదార్ధ, రసాయన శాస్త్రాలు ఈ విషయాన్ని ఒప్పుకుంటాయి. ఈ శాస్త్రాలు చెప్పిన నిజాలనే నేటి సమాజం నమ్ముతున్నది. మంచిదే. ఒక జపాన్ శాస్త్రవేత్త ఆవిష్కరించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ముందుగా తెలుసుకుందాం.    డాక్టర్  మసరూ ఎమోటో   మానవులు మాట్లాడే మాటలు , పాడే పాటలు , నృత్య శబ్దాలు  నీరు , ఆహారంపైన ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాయో  తన పరిశోధన ద్వారా తెలుసుకున్నారు . కొన్ని నీటి చుక్కలను తీసుకొని, వాటిముందు, వేరువేరుగా, కొని మంచిమాటలను, మంచి ప్రార్ధనలను, మంచి సంగీతాన్ని, మంచి సరళమైన నృత్య శబ్దాలను వినిపించారు. అలాగే, మరికొన్ని నీటి చుక్కలను తీసుకొని, వేరువేరుగా, కొన్ని చెడు/తీవ్రమైన  మాటలను, తీవ్రమైన  ( metallic music ) సంగీత శబ్దాన్ని, తీవ్రమైన నృత్య శబ్దాలను వినిపించారు. ఆ తరువాత, ఆ నీటి చుక్కలను మంచు ముక్కల్లాగా గడ్డకట్టించ...